ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈనెల 30వ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. 6 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశుడు.. నాల్గో రోజైన నేడు వెన్నకృష్ణుడి అలంకరణలో బాలాలయంలో సేవపై ఊరేగారు.
వెన్నకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు - yadadri district latest news
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నాల్గో రోజు అధ్యయనోత్సవాలు వైభవంగా జరిగాయి. వెన్నకృష్ణుడి అవతారంలో స్వామివారు బాలాలయ తిరువీధుల్లో ఊరేగారు. యాదాద్రీశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
![వెన్నకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు 4th day special festivities in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10034907-360-10034907-1609152282030.jpg)
వెన్నకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు
మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు కల్యాణం, శాశ్వత కల్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలు రద్దు చేశారు.
వెన్నకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన యాదాద్రీశుడు