తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కరోనా కలకలం.. 68 మందికి పాజిటివ్ - yadadri temple latest news

యాదాద్రి ఆలయంలో సిబ్బందికి భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 25 నుంచి ఆదివారం వరకు 68 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

yadadri temple , corona
యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం

By

Published : Mar 29, 2021, 11:23 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కరోనా పంజా విసురుతోంది. గత 25 నుంచి ఆదివారం వరకు 68 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. యాదాద్రి ఆలయంలో ఆదివారం 312 మందికి పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. అందులో 32 మంది ఆలయ ఉద్యోగులకు, మరో 6మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం

ఆర్జిత సేవలు నిలిపివేత

కరోనా సెకండ్​వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశామని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమాలు, అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన, నిజాభిషేకం, అర్చన, అలంకార సేవ వంటి నిత్య కైంకర్యాలు నిలిపివేశారు.

భయాందోళనలో భక్తులు

వీటితో పాటు ముందస్తు జాగ్రత్తగా భక్తులకు, అన్నదాన వితరణను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్పారు. కేవలం లఘుదర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్టు చెప్పారు. దీనితో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వారిలో ఆందోళన చోటుచేసుకుంది. ఎక్కువగా కొవిడ్ బారిన పడిన వారిలో అర్చకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details