భువనగిరిలోని నిధి పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మరణించాడు. యాదగిరిగుట్టకు చెందిన రేణుక, రాహుల్ దంపతులకు రెండురోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శిశువుకు మలమూత్ర విసర్జన సరిగా లేకపోవటం వల్ల వైద్యం కోసం పట్టణంలోని నిధి పిల్లల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. డాక్టర్ ఇచ్చిన మందులు శిశువుకి తాగించిన 3 నిమిషాలకే శిశువు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
'డాక్టర్ నిర్లక్ష్యంతో మా బిడ్డ చనిపోయాడు' - CRIME NEWS IN BHUVANAGIRI
వైద్యుల నిర్లక్ష్యంతో మూడు రోజుల శిశువు మృతి చెందిన ఘటన భువనగిరిలో చోటుచేసుకుంది. శిశువుకు మలమూత్ర విసర్జన సరిగా లేకపోవటం వల్ల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఇచ్చిన మందులు వేసిన మూడు నిమిషాలకే పసికందు ప్రాణాలు కోల్పోవటం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.
3 DAYS BABY DIED WITH MEDICAL REACTION IN BHUVANAGIRI
శిశువు కుటుంబీకులు వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. పసికందు మృతికి సిరప్ కారణం కాదని, ఇతర కారణాలు కావొచ్చని డాక్టర్ కిరణ్ తెలిపారు.