యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రెండో రోజు రాత్రి నృసింహ మూల మంత్ర జపాలు నిర్వహించారు.
శ్రీరామావతారంలో ఊరేగిన యాదాద్రీశుడు - శ్రీరామావతారంలో ఊరేగిన యాదాద్రీశుడు
వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాల మధ్య యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు శ్రీరామవతారంలో బాలాలయంలో ఊరేగారు.
శ్రీరామావతారంలో ఊరేగిన యాదాద్రీశుడు
అనంతరం హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకారంలో బాలాలయంలో ఊరేగుతూ కనువిందు చేశారు. యాదాద్రి నరసింహుని.. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన ఈ రోజు.. సహస్ర కళశాభిషేకంతో పరిసమాప్తి పలకనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.