ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 మంది వివిధ పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
యాదాద్రి జిల్లాలో 200 మంది అరెస్ట్ - tsrtc workers chalo tank band program in yadadri
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది వివిధ పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో 200 మంది అరెస్ట్
ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న వివిధ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టుల పట్ల వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
ఇదీ చూడండి: ఛలో ట్యాంక్‌బండ్: లిబర్టీలో అశ్వత్థామరెడ్డి అరెస్ట్