తెలంగాణ

telangana

ETV Bharat / state

Vasalamarri: సహపంక్తిలో పాల్గొన్న 18 మందికి అస్వస్థత - వాసాలమర్రి సహపంక్తి

వాసాలమర్రిలో కేసీఆర్​తో సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం ముచ్చటించిన ఆగమ్మ సైతం సభ ముగిశాక వాంతులు చేసుకున్నారు. తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలై ఉంటాయని అధికారులు తెలిపారు.

18-members-suffered-with-vomitings-and-motion-in-vasalamarri
Vasalamarri: సహపంక్తిలో పాల్గొన్న 18 మందికి అస్వస్థత

By

Published : Jun 25, 2021, 8:34 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి(Vasalamarri) జనం కష్టాలు తీర్చేందుకు నడుంబిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. దత్తత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు.

రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను అదే రాత్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆగమ్మ ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్చార్జ్​ చేసినట్లు సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ తెలిపారు. బుధవారం రోజున ఒక బాలిక అస్వస్థతకు గురి కావటంతో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు ఆ బాలికను ఇంటికి పంపారు. గ్రామంలో మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది.

బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి సీహెచ్‌.చంద్రారెడ్డి తెలిపారు. వారి అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా.. 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలై ఉంటాయని చెప్పారు.

ఇదీ చూడండి:Vasalamarri: పెద్దకొడుకులా సీఎం కష్టాలు తీరుస్తారని ఆగమ్మ ధీమా

ABOUT THE AUTHOR

...view details