యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా డ్రైవ్ నిర్వహించారు. 42 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో 17 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. కరోనా విజృంభణ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటినవారంతా టీకా వేయించుకోవాలని పేర్కొన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీలో 17 మందికి కరోనా పాజిటివ్ - corona cases in mothkur municipality
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో కరోనా అలజడి సృష్టిస్తోంది. 17మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
మోత్కూరులో కరోనా కేసులు