యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం పిలాయపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలులేని 35 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, ఓ కారు, ఓ బొలెరో వాహనంతో పాటు ఓ స్కూల్బస్సును స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు తయారీకి వాడే 10 కిలోల సోడియం కూడా స్వాధీనం చేసుకుని... నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. కొత్త మోటర్ వాహనం చట్టంపై గ్రామస్థులకు పోలీసులు అవగాహన కల్పించారు.
కల్తీ కల్లు కోసం వాడే 10 కిలోల సోడియం స్వాధీనం - bolero
యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కల్తీ కల్లు తయారీకి వాడే 10 కిలోల సోడియాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ కల్లు కోసం వాడే 10 కిలోల సోడియం స్వాధీనం