తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం - arpita Best Teacher Award winner

ధర్మసాగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అర్పిత.. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో సహచర అధ్యాపకులు ఆమెను సత్కరించారు.

zphs dharmasagar school teacher arpitha received best teacher award by state govt
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం

By

Published : Sep 9, 2020, 8:32 AM IST

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ జడ్పీహెచ్‌ఎస్‌‌ బాలిక పాఠశాలలో గణితం బోధిస్తున్న అర్పిత.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంస పత్రాన్ని అందజేసిన సహచర అధ్యాపకులు... ఆమెను సత్కరించారు.

తమ పాఠశాల టీచర్‌ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అర్పితకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details