హైదరాబాద్, హన్మకొండలో అత్యాచారం, హత్యకు గురైన దిశ,మానసల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామం చివరి నుంచి స్థానిక అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ సాగింది.
'కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలి' - youth held a candle rally In Warangal Urban District
అత్యాచారం, హత్యకు గురైన దిశ,మానసల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.
'కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలి'
ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే ఇటువంటి నేరాలకు కఠినమైన చట్టాలను రూపొందించి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: భారీగా డౌన్లోడైన 'హాక్–ఐ'