తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో ఉత్సాహంగా భాజపా సభ్యత్వ నమోదు - ఎన్డీయే ప్రభుత్వం

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి... భాజపాకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

మరో 40 లక్షల సంఖ్య సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేయాలి : చింతల

By

Published : Jul 8, 2019, 7:40 PM IST

సుపరిపాలనతోనే భాజపా సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆర్ధిక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని వివరించారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో భాజపాను ఆదరించి సభ్యత్వ నమోదు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 18 లక్షల సభ్యత్వ నమోదు ఉండగా మరో 40 లక్షల సంఖ్య నమోదయ్యేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

హన్మకొండ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details