తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ బాధితులకు యువత సాయం - ఐసోలేషన్​ బాధితులకు యువత సాయం

సాయం చేయాలనే తపన ఉండాలే గాని... ఎంత చేశామన్నది ముఖ్యం కాదు. తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో బియ్యం, నిత్యావసరాలు కొని కొవిడ్​ బాధితులకు అందజేశారు హన్మకొండలోని రాంనగర్​ రాజాజీ నగర్​ యువత.

hanmakonda news
వరంగల్​ వార్తలు

By

Published : May 12, 2021, 10:29 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని రాంనగర్​ రాజాజీ నగర్​ యువత తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ వద్దనున్న కొద్దిపాటి నగదుతోనే కొవిడ్​ బాధితులకు సాయం చేశారు. బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించారు.

కొవిడ్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితులకు తమ వంతు సాయంగా నిత్యావసరాలు అందించారు. ఐసోలేషన్​లో ఉంటున్న వారి ఇళ్లకు వెళ్లి సరుకులు అందించారు. యువత సాయం పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:అనవసరంగా బయటకొస్తే కేసులే..

ABOUT THE AUTHOR

...view details