వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయికిరణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ నుంచి వరంగల్‌కు వస్తున్న గ్రానైట్ లారీ.. హన్మకొండకు చెందిన సాయికిరణ్, అక్షయ్‌లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయి కిరణ్ కిందపడగా.. అతడి తల మీద నుంచి లారీ టైర్ దూసుకెళ్లింది. తల చిధ్రమై సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా అక్షయ్‌కి తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సాయికిరణ్ మీద పడి తల్లిదండ్రులు ఏడ్చిన తీరు.. అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి - హన్మకొండలో రోడ్డు ప్రమాదం
వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ వెనక నుంచి ఢీకొట్టడం వల్ల బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హన్మకొండ పట్టణంలోని పెద్దమ్మగడ్డ రోడ్డులో చోటు చేసుకుంది. మరో యువకుడికి తీవ్ర గాయలయ్యాయి.
వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి