వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో విషాదం చోటు చేసుకుంది. తాళ్లపెళ్లి ఆంజనేయులు (22) సోమవారం సాయంత్రం పశువులను మేపుకుంటూ ఊరి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు, స్థానికులు గ్రామ శివారులో యువకుడు ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు.
మూర్ఛతో చెరువులో పడి యువకుడు మృతి - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
సోమవారం సాయంత్రం పశువులను మేపుకుంటూ ఊరి బయటకు వెళ్లిన యువకుడు మంగళవారం ఉదయం శవవై తేలాడు. మూర్ఛ వ్యాధితో చెరువులో పడి మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విషాదకర ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కొప్పూరులో జరిగింది.

మూర్ఛతో చెరువులో పడి యువకుడు మృతి
చివరకు నేడు మంగళవారం చెరువులో యువకుడి మృత దేహం తేలి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెలికితీశారు. చెరువు కట్టకు చేరుకోగానే మూర్ఛ వ్యాధి రావడం వల్ల చెరువులో పడి ఆంజనేయులు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?
Last Updated : Jul 7, 2020, 10:59 AM IST