తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలుడిని మింగిన చెరువు - Young boy died dip in a lake

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలో దారుణం చోటుచేసుకుంది. గేదెలకు నీళ్లు తాగించటానికి వెళ్లి మహేష్ అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతి చెందటం వల్ల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.

బాలుడిని మింగిన చెరువు

By

Published : Jul 9, 2019, 11:08 PM IST

గేదెలకు నీళ్లు తాగించటానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మహేష్ అనే 14 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ పెద్ద చెరువులో చోటు ఈ ఘటన చేసుకుంది. గేదెలు మేపడానికి చెరువు ప్రాంతంలోకి వెళ్లిన బాలుడు వాటిపై ఎక్కి నీటిలోకి వెళ్లాడని తోటి బాలుడు తెలిపాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా గేదెపై నుంచి బాలుడు జారీ నీటిలో పడటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తోటి బాలుడు ఇచ్చిన సమాచారంతో గ్రామస్థులు చెరువు నీటిలో వెతకగా మహేష్ మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటం వల్ల బాలుడి తల్లిదండ్రులు గుండెలువిలపించేలా రోదించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

బాలుడిని మింగిన చెరువు

ABOUT THE AUTHOR

...view details