తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎం స్వనిధి : వరంగల్​ బల్దియాలో శిక్షణా కార్యక్రమం - వరంగల్​ బల్దియాలో శిక్షణా కార్యక్రమం

'పీఎం స్వనిధి'లో భాగంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వరంగల్​ మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు మెప్మా సిబ్బందికి బల్దియా ప్రధాన కార్యాలయంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

work shop was conducted in warangal greater in the part of pm swanithi
పీఎం స్వనిధి: వరంగల్​ బల్దియాలో శిక్షణా కార్యక్రమం

By

Published : Dec 24, 2020, 12:16 PM IST

'పీఎం స్వనిధి'లో భాగంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వరంగల్​ మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ మేరకు మెప్మా సిబ్బందికి బల్దియా ప్రధాన కార్యాలయంలో ఒకరోజు శిక్షణ(వర్క్ షాప్) కార్యక్రమం నిర్వహించారు.

అంతర్జాలం ద్వారా కేంద్ర ప్రభుత్వ క్యూసీఐ సభ్యులు.. ఆర్పీలు, సీఓలకు అవగాహన కల్పించారు. వారు క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన సర్వే, నియమ నిబంధనలతో పాటు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు తదితర వాటిని మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను వివరించారు. సిబ్బంది లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ సర్వే నిష్పక్షపాతంగా చేయాలని బల్దియా అధికారులు సూచించారు.

ఇదీ చదవండి:రైతును రాజుగా చూడటమే సీఎం లక్ష్యం: మంత్రి సబిత

ABOUT THE AUTHOR

...view details