తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2019, 3:51 PM IST

ETV Bharat / state

నీటికోసం బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు

గొంతెండిపోతోంది తాగునీరివ్వండి మహాప్రభో అంటే వినే నాథుడే కరవయ్యాడు.. అధికారులకు తమ నీటి కష్టాలు వినిపించి వినిపించి విసుగు చెందారు. పాలకులు, అధికారుల తీరుమారక పోయేసరికి ప్రజలు తమ రూటే మార్చారు. నీటి కోసం రోడ్డుపై బిందెలు, డ్రమ్ములను అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు.

నీటికోసం అతివల పాట్లు

నీటికోసం అతివల పాట్లు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో మహిళలు నీటికోసం రోడ్డెక్కారు. రోడ్డుకు అడ్డంగా బిందెలను, డ్రమ్ములను పెట్టి నిరసనకు దిగారు. మడికొండలోని 34వ డివిజన్​లో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని వాపోయారు. వారానికొకసారి వచ్చే నల్లా నీళ్లు కనీస అవసరాలకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

పక్కదారి పడుతున్న ట్యాంకర్లు

మున్సిపాలిటీ వారు సరఫరా చేసే ట్యాంకర్లను సిబ్బంది నగదుకు ఆశపడి బయటివారికి అమ్మకుంటున్నారని ఆరోపించారు. తమ గోడు ఎన్ని సార్లు విన్నవించినా హామీలే తప్ప చేతల్లో కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్తంభించిన ట్రాఫిక్​ తరలివచ్చిన పోలీసులు

మహిళల నిరసనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. చేసేదేమీ లేక మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించి ట్రాఫిక్​ పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:నిట్​లో ర్యాగింగ్​... ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్​​

ABOUT THE AUTHOR

...view details