వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలంలో రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి.. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం రోడ్డెక్కి మహిళల నిరసన!
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రహదారిపై మహిళలు నిరసన వ్యక్తం చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలంలో చోటుచేసుకుంది. అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం రోడ్డెక్కి మహిళల నిరసన!
సోమిడి 52వ డివిజన్లోని తాగునీటి సమస్యలపై.. కార్పొరేటర్, మున్సిపల్ అధికారులను పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ ఫలితం లేదని స్థానికులు వాపోయారు. మరోవైపు డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగానే ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కాలువలను శుభ్రం చేయడం లేదన్నారు.
ఇదీ చదవండి:తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన