తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్‌ బీచ్‌బాల్.. యమ క్రేజ్ గురూ..! - తెలంగాణ వార్తలు

ఇసుకంటే ఇష్టపడని వారెవరుంటారు. ఇక ఆ ఇసుకలో ఆటలంటే ఎలాంటి వారైనా ఎగిరి గంతేస్తారు. పట్టణాల్లో నివసించేవారైతే... ఇసుకలో నిర్వహించే బీచ్‌బాల్‌, వాలీబాల్, ఇతర ఆటలు ఆడాలని ఆశపడుతుంటారు. మరి ఇవన్నీ చేయాలంటే గోదావరి తీరానికో లేదా సముద్రపు ఒడ్డుకో వెళ్లాలి. అయితే వరంగల్‌ వాసులకు ఆ అవసరం లేదు. ఎందుకో తెలుసా...?

warangal beach, women beach ball
వరంగల్‌ బీచ్‌బాల్, మహిళల బీచ్ బాల్

By

Published : Aug 1, 2021, 9:41 PM IST

సన్నని ఇసుక. మెత్తని ఆ తడి ఇసుక కనిపిస్తే చాలు ఎవరైనా చిన్న పిల్లల్లాగా మారి ఆటలాడుతారు. అయితే ఇలాంటి వాతావరణం నదీ, సముద్ర తీరాల్లోనే ఉంటుంది. కానీ వరంగల్‌లో ఓ బీచ్ ప్రత్యక్షమైంది. అదేంటి సముద్రమే లేని చోట.... బీచ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా....?

ఇలా బీచ్..

బీచ్‌లోని ఇసుకలో సరదాగా ఆడుకోవాలనే కోరిక ఉన్నవారికోసం.... వరంగల్‌కు చెందిన కొంతమంది యువకులు ఓ చిట్కా ప్రయోగించారు. భద్రకాళి సరస్సు పక్కన బీచ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. అందులో అతివలు ఉత్సాహంగా వాలీబాల్‌ ఆడుతూ సందడి చేస్తున్నారు. వరంగల్‌లో బీచ్ వాలీ బాల్‌ ఆటకి ఫుల్ క్రేజ్‌ పెరిగింది.

ఉత్సాహంగా బీచ్‌బాల్

బీచ్‌బాల్‌ అయితే ఏకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అలాంటి వారి కోరికను తీర్చడం కోసం వరంగల్‌కు చెందిన కొంతమంది యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. వరంగల్- హన్మకొండ జంట నగరాల మధ్య ఉన్న భద్రకాళి బండ్ పక్కనే బీచ్ బాల్ జోన్ ఏర్పాటు చేశారు. సరిగ్గా సముద్రపు ఇసుకలో ఆడుతున్న అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దారు. ఇందులో మహిళలు ఉత్సాహంగా బీచ్‌బాల్‌ ఆడుతున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం పోటాపోటీగా ఆడుతున్నారు.

మహిళలే అధికం

ఓ వైపు భద్రకాళి సరస్సు మరోవైపు అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న భద్రకాళి బండ్ పక్కనే ఏర్పాటు చేసిన బీచ్ బాల్ జోన్ ఆకట్టుకుంటోంది. ఈ రెడీమెడ్‌ బీచ్‌లో ఆడేందుకు చాలామంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

వరంగల్‌ బీచ్‌బాల్

ఇసుకలో ఆడే ఆటలు వ్యాయామంగాను ఉపయోగపడుతుంది. నిత్యం పనులతో గడిపే తమకు సేద తీరేందుకు ఉపయోగపడుతుంది. బీచ్‌లో ఆడుకోవాలనే కోరిక సైతం తీరుతుంది. ఇలా ఆడుకోవడం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి.

-మహిళలు

బీచ్ బాల్ సెట్టింగ్‌లో ఓరుగల్లు వాసులు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబసభ్యులతో సేద తీరుతున్నారు.

ఇదీ చదవండి:Corn recipes : కార్న్​తో వెరైటీ వంటకాలు.. తింటే వాహ్వా అంటారు...

ABOUT THE AUTHOR

...view details