తెలంగాణ

telangana

ETV Bharat / state

బిందెలతో నిరసన చేసిన మహిళలు - mission bhagiratha

వరంగల్ నగరం దేశాయిపేటలోని బ్యాంక్ కాలనీలో మహిళలు ధర్నా చేపట్టారు. గత కొన్ని రోజులుగా నల్లాలు రాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రతరమైందని వాపోయారు.

women's protest for water
బ్యాంక్ కాలనీలో మహిళలు ధర్నా

By

Published : Mar 27, 2021, 5:36 PM IST

తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశాయిపేటలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న గృహిణులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

కొన్ని రోజులుగా నల్లాలు రాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రతరమైందని వాపోయారు. వరంగల్ మహానగర పాలక సంస్థ మంచినీరు అందించడంలో నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. నగరంలో మిషన్ భగీరథ పనులు జరుగుతున్న క్రమంలో తాగునీటి సమస్య ఏర్పడిందని అధికారులు వివరించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'ఓట్ల కోసమే మోదీ బంగ్లాదేశ్​ పర్యటన'

ABOUT THE AUTHOR

...view details