హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వెల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాగా.. మహిళలు అడ్డుకున్నారు. అధికార పార్టీకి నచ్చిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యేతో మహిళలు వాగ్వాదానికి దిగారు. అందరికి డబుల్ బెడ్రూం ఇస్తామని చెప్పారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రానివారి వివరాలు తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో మహిళలు శాంతించారు.