సికింద్రాబాద్‌లో కార్మికురాలిగా పనిచేసేసరితా పటేల్ ఛత్తీస్‌గఢ్‌లోని తన ఇంటికి వెళ్తుండగా జనగామ రైల్వే స్టేషన్ దాటగానే నొప్పులు ప్రారంభమయ్యాయి. పెండ్యాల స్టేషన్ దాటిన తర్వాత నొప్పులు ఎక్కువ కావడం వల్ల ఆమె రైలులోనే ప్రసవించింది.
అనంతరం 108కి సమాచారం అందించారు. రైలు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే అంబులెన్స్ సిబ్బంది తల్లికీ, బిడ్డకి ప్రాథమిక చికిత్స చేసి.. హన్మకొండలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది