ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలం వైకుంఠపురానికి చెందిన పద్మ తన భర్త చనిపోవడం వల్ల కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేది. ఆదాయం సరిపోకపోవడం వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారింది. ఆలోచనతో బస్టాండు, రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగులు, పర్సులోని బంగారు అభరణాలను చోరీ చేయడం ప్రారంభించింది.
గతంలో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చి.. మళ్లీ చోరీలు ప్రారంభించినట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 చోరీలకు పాల్పడిందని సీపీ వెల్లడించారు. గత నెల 25న జనగామ బస్టాండులో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కిందని తెలిపారు. దృశ్యాల ఆధారంగా నిందితురాలిని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు.