తెలంగాణ

telangana

ETV Bharat / state

అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం - వరంగల్​ జిల్లా తాజా వార్తలు

వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ మహిళ మృతదేహాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు ఆమె మృతదేహం వర్షంలో తడుస్తూ ఉంది. వర్షం తగ్గితే గానీ మార్చురీకి తరలించలేదు ఆసుపత్రి సిబ్బంది.

అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం
అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం

By

Published : Jul 20, 2020, 7:03 PM IST

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో... ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు మృతదేహాన్ని వర్షంలోనే వదిలేశారు. సుమారు రెండు గంటల సేపు క్యాజువాలిటీ ముందే ఉండిపోయింది.

హన్మకొండకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో ఎంజీఎంకు వచ్చింది. చికిత్స అందించే లోపే.. కన్నుమూసింది. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ మహిళ కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా... క్యాజువాలిటీ ముందు వర్షంలోనే వదిలేశారు. ఆ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది సైతం పట్టించుకోలేదు. వర్షం తగ్గిన తర్వాత సిబ్బంది ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details