తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండెపోటుతో మహిళా కండక్టర్ మృతి - Woman conductor dies of heart attack in Warnagal

గుండెపోటుతో లత మహేశ్వరీ అనే మహిళా ఆర్టీసీ ఉద్యోగిని ప్రాణాలు వదిలారు. హుస్నాబాద్ బస్సు డిపోలో ఆమె కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవటం వల్ల మనస్తాపానికి గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

గుండెపోటుతో మహిళా కండక్టర్ మృతి

By

Published : Oct 28, 2019, 11:54 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన గడ్డం లత మహేశ్వరీ హుస్నాబాద్ డిపోలో కండక్టర్​గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆర్టీసీ సమ్మె చర్చలు విఫలమవటం వల్ల మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు.

గుండెపోటుతో మహిళా కండక్టర్ మృతి

ABOUT THE AUTHOR

...view details