తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్తను హత్యచేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ఆతర్వాత ఏమైదంటే - భర్తను చంపిన భార్య

Wife Killed Her Husband: మద్యం రక్కసి దాహానికి ఓ పచ్చని కాపురం బలై పోయింది. మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన ఆ ఇల్లాలు.. అతడిని చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Wife Killed Her Husband
Wife Killed Her Husband

By

Published : Apr 5, 2023, 10:51 PM IST

Wife Killed Her Husband: మద్యం మత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగులుస్తోంది. ఓ వైపు మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు తాగిన మైకంలో విచక్షణ మరిచి కొందరు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడానికి లేదా ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. ఫలితంగా తమతో పాటు ఇతరుల జీవితాలను కడతేరుస్తున్నారు.

తాగి వచ్చి చిత్రహింసలు గురి చేస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వతగిరి మండలం ముంజాల కుంట తండా వద్ద జాటోతూ శ్రీను అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా.. మృతుని భార్య శాంతి.. భర్తను అంతమొందించిదని దర్యాప్తులో తేలింది. ఇందుకు ఆమె ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి సహకరించారని గుర్తించారు. నిందితులు శ్రీనును హత్యచేసి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని మామునూరు ఏసీపీ కృపాకర్ వెల్లడించారు.

మరోవైపు హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి పైకప్పు తొలగించి దొంగతనాలు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్థుడిని అరెస్టు చేశామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ వెల్లడించారు. గత నెల 25వ తారీఖున అత్తాపూర్​లో ఓ మొబైల్ షాప్ ​పై కప్పు తొలగించి 6 యాపిల్ ఫోన్లు 6 శాంసంగ్, మరో 3 చరవాణిలను దొంగిలించాడని గంగాధర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టగా నిందితుడి వంశీగా గుర్తించామని చెప్పారు.

దీనిపై పక్కా సమాచారంతో ఈరోజు ఏపీలోని కర్నూల్​లో నిందితుడి వంశీని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని ఏసీపీ గంగాధర్ తెలిపారు. నిందితుడిని వద్ద నుంచి పోలీసులు రూ.13 లక్షల విలువ చేసే 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గతంలో అతనిపై 6 కేసులు నమోదయ్యాయని, నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చి అదేపనిగా చోరీలు చేస్తున్నాడని అన్నారు. అతడిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ గంగాధర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details