పురుగుల మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం - devannapeta
భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా దేవన్నపేటలో కలకలం రేపింది. భూమి విషయంలో తన అన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లారు.
పురుగుల మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో భార్య భర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అలువల శ్రీదేవి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లారు. స్థానికులు గుర్తించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భూమి దస్తావేజుల విషయంలో అన్న... 5 సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రభాకర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.