తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - Warangle rain updates

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి.

వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

By

Published : Oct 14, 2020, 3:46 PM IST

అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ధర్మసాగర్ మండల కేంద్రం, ముప్పారం గ్రామాల మధ్య వరదనీరు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రెండు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి.

ఇవీచూడండి:భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details