తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో కాంగ్రెస్​ పార్టీ భారీ ద్విచక్రవాహన ర్యాలీ - vh

ప్రచార పర్వం ఆఖరి రోజున వరంగల్ పార్లమెంటు అభ్యర్థి దొమ్మటి సాంబయ్యకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని కడిపికొండ  నుంచి ఎంజీఎం వరకు భారీ ర్యాలీ చేశారు.

వరంగల్​లో కాంగ్రెస్​ ర్యాలీ

By

Published : Apr 9, 2019, 4:51 PM IST

వరంగల్​ పట్టణంలో కాంగ్రెస్​ భారీ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్​ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యకు మద్దతుగా సీనియర్ నేతలు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొని హస్తం గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. హన్మంతరావు ద్విచక్రవాహనాన్ని నడిపి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నగరంలోని కడిపికొండ వంతెన నుంచి కాజీపేట రైల్వే స్టేషన్, సుబేదారి, నక్కలగుట్ట, హన్మకొండ చౌరాస్తా, వరంగల్ ఎంజీఎం వరకు ర్యాలీ సాగింది. హామీల అమలులో ఎన్డీఏ సర్కారు విఫలమైందని వీహెచ్​ ఆరోపించారు. దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రక అవసరమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

వరంగల్​లో కాంగ్రెస్​ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details