వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్‌పల్లిలో 9 నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. వరంగల్ జిల్లా అదనపు కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది. ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. జూన్ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిపాపను ఎత్తుకెళ్లి...అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు ప్రవీణ్. ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి 20 రోజుల్లోపే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించిన న్యాయస్థానం... నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్ తీర్పు వెలువరించారు. ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు విచారణ పూర్తైంది.
పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష - rape case
వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. వరంగల్ జిల్లా అదనపు కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది.
పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
ఇవీ చూడండి:'శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్'
Last Updated : Aug 8, 2019, 2:47 PM IST