తెలంగాణ

telangana

ETV Bharat / state

CHENETHA JEANS: చేనేత జీన్స్‌.. విభిన్న రకాల డిజైన్లు రూపొందిస్తున్న నేతన్నలు - కమలాపూర్

కళాత్మక నైపుణ్యం, అపూర్వ మేధాశక్తితో కూడిన చేనేత రంగం భారతదేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. శతాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసినా ఈ వస్త్ర రాజసం వన్నె మాత్రం ఏనాడు తగ్గలేదు. ప్రజల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రకాలతో సొబగులందుకుంటూ వస్తోంది. చేనేత పరిశ్రమ. మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్‌ హోరుకు దీటుగా విభిన్న రకాల డిజైన్ల రూపొందిస్తున్న నేతన్నలు యువత అభిరుచులకనుగుణంగా జీన్స్‌ దుస్తులను సైతం నేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

Weavers creating a wide
చేనేత జీన్స్‌

By

Published : Oct 28, 2021, 4:48 AM IST

Updated : Oct 28, 2021, 9:36 AM IST

చేనేత జీన్స్‌.. విభిన్న రకాల డిజైన్లు రూపొందిస్తున్న నేతన్నలు

జీన్స్‌ వస్త్రాలు ఫ్యాషన్‌కు మారుపేరు. ఇప్పుడు చేనేతలోనూ తొలిసారిగా జీన్స్‌ వచ్చేసింది. సాధారణ రకానికి ఏమాత్రం తీసిపోని విధంగా హన్మకొండ జిల్లా కమలాపూర్‌ చేనేత సంఘంలో నేతన్నలు ఈ జీన్స్‌ను చేనేత మగ్గంపై నేశారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక దృష్టిసారించి ఉత్పత్తి వైవిధ్యాన్ని (ప్రోడక్ట్‌ డైవర్సిఫికేషన్‌) ప్రోత్సహించి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ క్రమంలో కమలాపూర్‌ చేనేత సంఘం వారు నిజాం కాలంలో సంపన్న కుటుంబీకులు ధరించే హిమ్రూ నమూనా దుస్తులు, చీరలు నేసి గత సంవత్సరం పురస్కారాలు సైతం అందుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న దుస్తులపై దృష్టి పెట్టి జీన్స్‌ వస్త్రాన్నీ నేయడం నేర్చుకొన్నారు. గత మూడు నెలల నుంచి మగ్గంపై వీటిని నేస్తూ వైవిధ్యమైన దారిలో సాగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు దుకాణదారులు ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి ఈ ఉత్పత్తిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. హన్మకొండ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ.. ఇది అచ్చమైన కాటన్‌ జీన్స్‌ అని, ధరించేందుకు ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. మీటరు రూ.300 చొప్పున అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం మాదిరిగానే ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిదాంట్లో కొత్తదనం కోరుకునే యువతను ఆకర్షించే ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎప్పుడూ ముందుంటుంది. స్టైలిష్‌ జీన్స్‌ దుస్తులు. అందుకే వ్యాపారులు పోటీపడుతూ జీన్స్‌లో కొత్త రకాలను మార్కెట్లోకి తీసుకువస్తుంటారు. ఈ తరుణంలోనే చేనేత మగ్గంపై తొలిసారిగా జీన్స్‌ను తీర్చిదిద్దారు నేతన్నలు. సాధారణ రకానికి ఏమాత్రం తీసిపోని విధంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ చేనేత సంఘంలో ఈ జీన్స్‌ను చేనేత మగ్గంపై చేశారు.


నిజాంకాలంలో సంపన్న కుటుంబీకులు ధరించే హిమ్రూ నమూనా దుస్తులు, చీరలు నేసి గత ఏడాది పురస్కారాలు సైతం అందుకున్న కమలాపూర్ చేనేత సంఘం నేతకార్మికులు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న దుస్తులపై దృష్టి పెట్టి జీన్స్ వస్త్రాన్నీ నేయడం నేర్చుకొన్నారు. గత మూడు నెలల నుంచి మగ్గంపై వాటిని వేస్తూ వైవిధ్యమైన దారిలో సాగుతున్నారు.

రవీందర్, జౌళి అధికారి


ఇది అచ్చమైన కాటన్‌జీన్స్ అని ధరించేందుకు ఎంతోఅనువుగా ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. ప్రస్తుతానికి నీలి రంగులో రూపొందించగా కావాల్సిన రంగుల్లో వాటిని తయారుచేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు దుకాణదారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఆ సరుకును మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. త్వరలో దీనికి ఏకశిల జీన్స్‌ అని పేరు పెట్టే యోచనలో చేనేత జౌళి శాఖ ఉంది.

ఇదీ చూడండి:

KTR: 'దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతం'

Last Updated : Oct 28, 2021, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details