తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది - water dropped from pond at gopalpur

చెరువు తూముకు బుంగ పడి నీరంతా వృథాగా పోతోందని ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని వేడుకుంటున్నారు.

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

By

Published : Nov 5, 2019, 9:17 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​లోని పెద్ద చెరువు నుంచి నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నక్కల తూముకు బుంగ పడి నీరంతా వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు తూముకు మరమ్మతులు నాసిరకంగా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి వచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులను గ్రామస్థులు, రైతులు నిలదీశారు. మూడేళ్లకే తూము చెడిపోవడానికి కారణం నాసిరకం పనులేనని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయిస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

చెరువు తూముకు చిల్లుపడింది... రైతుల గుండె ఝల్లుమంటోంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details