సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నేతలు తెరాసలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలోని సుమారు 100 మంది కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
'సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరారు' - గులాబీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ లీడర్లు
వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలంలో.. పలువురు కాంగ్రెస్ మాజీ కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
స్థానిక డివిజన్ జనరల్ మహిళకు కేటాయింపు జరిగినందున.. ఆ స్థానాన్ని బీసీ మహిళకే ఇవ్వాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. తామంతా సమష్టిగా కృషి చేసి ఆ స్థానాన్ని గెలిపించుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:ఓటర్లకు డబ్బుల పంచుతున్నాడని కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్