తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యకు కరోనా అడ్డు కాదు: వర్థన్నపేట ఎమ్మెల్యే - వరంగల్​ పట్టణ జిల్లా వార్తలు

విద్యకు ఏదీ అడ్డుకాదని... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విద్యను కొనసాగించాలని విద్యార్థులకు వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్​ సూచించారు. వరంగల్​ పట్టణ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించారు.

wardhannapet mla aroori ramesh books distribution in warangal urban district
విద్యకు కరోనా అడ్డు కాకూడదు: వర్థన్నపేట ఎమ్మెల్యే

By

Published : Jul 22, 2020, 7:50 PM IST

కరోనాను ఎదుర్కొంటూనే విద్యను కొనసాగించాలని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్​ విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పట్ఠణ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని విద్యార్థులతో ఎమ్మెల్యే రమేష్ సంభాషించారు.

పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందిస్తూ... విద్యకు ఏది అడ్డుకాదని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విద్యను కొనసాగించాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. జాగ్రత్తలు వహిస్తూ విద్యనభ్యసించాల్సిందిగా పిల్లలకు ఎమ్మెల్యే వివరించారు.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​ భార్యకు డిప్యుటీ కలెక్టర్​గా ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details