వరంగల్ నగరానికి చెందిన అజిత్‌కుమార్ గందె అమెరికాలో భారతదేశ ప్రతిష్టను చాటారు. తన ప్రతిభా పాటవాలతో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ హక్కులను సాధించటంతోపాటు ఫేస్‌బుక్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారు.‘ క్లౌడ్ మాడిఫికేషన్ ఆఫ్ మాడ్యులర్ అప్లికేషన్స్ రన్నింగ్ ఆన్ లోకల్ డివైసెస్’ అనే సరికొత్త ఆవిష్కరణ ద్వారా ఈ ఘనత సాధించినట్లు అజిత్‌కుమార్ మామయ్య, వరంగల్‌కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ పీవీ.నారాయణ తెలిపారు.
క్లౌడ్ మాడిఫికేషన్‌లో సత్తాచాటిన ఓరుగల్లు యువకుడు - patent on cloud modification
వరంగల్ అర్బన్ జిల్లా అజిత్ కుమార్ గందె తన ప్రతిభా పాటవాలతో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ హక్కును సాధించారు. క్లౌడ్ మాడిఫికేషన్‌లో ఆయన పేటెంట్ హక్కులు సాధించటంతో పాటు ఫేస్‌బుక్ సంస్థలో ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
క్లౌడ్ మాడిఫికేషన్‌లో ఓరుగల్లు యువకుడికి పేటెంట్
వరంగల్ నిట్‌లో చదువుకున్న అజిత్‌కుమార్ మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు నిర్వహించి యాజమాన్యం ప్రశంసలు పొందారన్నారు. అతని ప్రతిభను చూసిన ఫేస్‌బుక్ సంస్థ అత్యుత్తమ ప్యాకేజీతో ఉన్నతమైన ఉద్యోగం ఆఫర్ చేసిందన్నారు. ఆయన తండ్రి ఉమాశంకర్ నగరంలో ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.
TAGGED:
patent on cloud modification