నాలాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించే పనిలో ప్రజలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరారు. హన్మకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
'నాలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రజలు సహకరించాలి' - తెలంగాణ తాజా వార్తలు
ఆక్రమణలకు గురైన నాలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించే క్రమంలో ప్రజలందరూ సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కోరారు. హన్మకొండలో ఇటీవల వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు.
'నాలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రజలు సహకరించాలి'
నాలాలు వెడల్పు చేస్తున్న క్రమంలో ఇళ్లు పోతున్నాయని పలువులు బాధితులు తమ గోడును ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఇళ్లను కూల్చి వేయొద్దని విజ్ఞప్తి చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న స్థానికులకు.. స్థానిక కార్పొరేటర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నాలాల వెడల్పులో పేదల ఇళ్లు కోల్పోతే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:పార్కింగ్ స్థలం ఎక్కడుందో.. చెప్పేసే యాప్ వచ్చేసింది!