కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలలో ఎటువంటి కోతలు విధించకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తాజా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు కాజీపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అర్హులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెరాస సర్కారు వరంగల్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు అర్హులుకు రూ. 52 లక్షలకు పైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, రూ. 11 లక్షల రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభం