వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, బిగ్ బాస్ షో విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నాయీబ్రాహ్మణులకు సరుకులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ.. దాదాపు 600 క్షురకులు నిత్యావసర సరుకులు పొందారు.
600 మంది నాయీబ్రాహ్మణులకు సరుకులు పంపిణీ - HANAMKONDA, WARANGAL URBAN DISTRICT
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
హన్మకొండలో నాయీబ్రాహ్మణులకు కిరాణా సామగ్రి పంపిణీ
కష్టకాలంలో ఉన్న ప్రజలందరికీ ఏదో విధంగా సాయం చేసి వారికి అండగా నిలుస్తున్నామని వినయ్ భాస్కర్ తెలిపారు. కరోనాపై అవగాహన కలిగించే పాట పాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని రాహుల్ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల కులవృత్తి తమకు శాపంగా మారిందని.. పూట గడవడం కష్టంగా ఉందని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు.
Last Updated : May 2, 2020, 10:48 PM IST