కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో భాజపా నాయకులు మత రాజకీయాలకు తెరలేపారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మత సామరాస్యానికి కాపాడేందుకు అవసరమైతే పదవి, ప్రాణ త్యాగానికి సిద్ధమేనని వెల్లడించారు.
మతసామరస్యం కాపాడేందుకు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమే! - mla vjiay bhaskar fire on bjp leaders
భాజపా నాయకులుపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మత రాజకీయాలకు తెరలేపి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
అవసరమైతే .. ప్రాణ త్యాగానికైనా సిద్ధమే!
మతవిద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేంలేదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే.. నగర అభివృద్ధిపై భాజపా నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భాజపా విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం!