తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు: వినయ్​ భాస్కర్​ - warangal news

ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ అన్నారు. ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా హన్మకొండలోని సమ్మయ్యనగర్​లో ఆయన పర్యటించారు.

mla vinay bhaskar in praja sankshema yatra
ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు : వినయ్​ భాస్కర్​

By

Published : Feb 8, 2021, 3:24 PM IST

ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. యాత్రలో భాగంగా హన్మకొండలోని సమ్మయ్య నగర్​లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్​ రాని వారికి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు : వినయ్​ భాస్కర్​

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. వరంగల్​ అభివృద్ధికి ప్రతి నెల రూ.70 కోట్ల నిధులు విడుదల చేస్తున్నారని వెల్లడించారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి :దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details