తెరాస ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమ పథకాలతో ముందుకుపోతోందని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. పట్టణ ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా హన్మకొండలోని బాలసముద్రంలో.. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌తో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో..' - వరంగల్ పట్టణ జిల్లా తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని... ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని బాలసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు'
కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లో కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లను వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: మొరం గడ్డలు.. ఒకొక్కటి నాలుగు కిలోల పైమాటే..