వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ 4వ బెటాలియన్‌లోని పీటీసిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని... డీఎస్పీలు శ్రీనివాస్, రాగ్యానాయక్లు అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల ఆశయాలను కొనసాగించాలని సూచించారు. వారిచ్చిన స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ... ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలన్నారు.
'పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం..' - అమరులకు నివాళులు అర్పించిన డీఎస్పీ
పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూనే... వారిచ్చిన స్ఫూర్తితో విధుల్లో రాణిస్తూ... ప్రజలకు సేవలు అందించాలని వరంగల్ డీఎస్పీ శ్రీనివాస్, రాగ్యానాయక్లు సూచించారు. విధుల్లో చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పని చేయాలన్నారు.
'పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం..'
ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి వుంటుందని డీఎస్పీలు తెలిపారు. అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై వుందని... వారికి ఎలాంటి సమస్య ఉన్నా... పోలీస్ విభాగం వారికి పూర్తి సహకారం అందజేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:పోలీసుల త్యాగాలు అజరామరం, అనిర్వచనీయం: సీఎం కేసీఆర్