తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతరను తలపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయం - telangana news

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగింది. గురువారం ఒక్కరోజే సుమారు 250 దస్తావేజులు నమోదయ్యాయి. దీంతో రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.

రిజిస్ట్రేషన్ కార్యాలయం
Registration Office

By

Published : Dec 25, 2020, 7:34 AM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్​లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూమి కొనుగోలు, అమ్మకందారులు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

గురువారం ఒక్కరోజే సుమారు 250 దస్తావేజులు నమోదు అయ్యాయి. రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.06 కోట్ల ఆదాయం సమకూరింది.

ABOUT THE AUTHOR

...view details