కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రమే బడులు ప్రారంభించి... తర్వాత మూసివేశారని వరంగల్ అర్బన్ జిల్లా ప్రైవేటు ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇప్పటికే కరోనా వల్ల జీతాల్లేక అల్లాడుతోంటే.. మళ్లీ ఇప్పుడు పాఠశాలలు మూసివేశారని వాపోయారు. బార్లు, సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తెరిస్తే వస్తోందా అని ప్రశ్నించారు. పాఠాలు లేకుండా ప్రమోట్ చేయటం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
'బార్లు తెరిస్తే రాని కరోనా.. బడులు తెరిస్తే వస్తోందా?' - Concern of private school teachers
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలని వరంగల్‌లో... టీచర్లు ఆందోళన నిర్వహించారు. బార్లు, సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తెరిస్తే వస్తుందా అని ప్రశ్నించారు. కాశిబుగ్గ కూడలి నుంచి పోచం మైదాన్ వరకు ర్యాలీ చేపట్టారు.
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఆందోళన
కరోనా సాకుతో తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ భవిష్యత్ గురించి ఆలోచన చేయాలన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని... వెంటనే పాఠశాలలు తెరిచి తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్ల ర్యాలీకి పలు విద్యార్థి సంఘాలతో పాటు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది.