వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హన్మకొండలోని మినీ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. నాలలపై అక్రమ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులపై చర్చించారు. నాలలపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని స్పష్టం చేశారు.
అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే: కలెక్టర్
నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కచ్చితంగా తొలిగించాల్సిందేనని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. హన్మకొండలోని మినీ సమావేశ మందిరంలో నాలలపై అక్రమ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులపై పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు.
అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే: కలెక్టర్
అర్అండ్బీ జాతీయ రహదారుల మున్సిపాలిటీ ఇరిగేషన్ సిటీ ప్లానర్ ఎస్సీలతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని నగర పాలక కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కమిటీ నగరంలో నాలాల్లో ప్రహిస్తున్న వరదను శాస్త్రీయంగా అంచనా వేయాలన్నారు. నాలాల యొక్క ఎంత విస్తీర్ణ, లోతు చేయాలో నిర్ణయించాలన్నారు. కమిటీ ముందుగా పెద్ద పెద్ద నాలాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 5 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు.