వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల నిర్మాణానికి సుమారు 200 ఎకరాల భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినందున... ఆ భూములు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించినట్లు సమాచారం.
ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - warangal urban district
వరంగల్ పట్టణ జిల్లా దేవునూర్, ముప్పారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల నిర్మాణం కోసం గతంలో 40 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమి చుట్టుపక్కల గల రైతులతో మాట్లాడి మరిన్ని భూములు సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఈ ప్రాంతంలో గతంలో సేకరించిన 40 ఎకరాల భూమితో పాటుగా దాని చుట్టుపక్కల గల రైతులతో సంప్రదింపులు జరిపి భూములు సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు జిల్లా కలెక్టర్ దయానంద్, ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ తదితరులు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్కు వివరించారు.
ఇవీ చూడండి: 'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'