శ్రీరాముడు అందరివాడని.. రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వరంగల్ అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. తన వంతుగా లక్ష రూపాయల చెక్కును తీర్ధక్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు.
'రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి' - Warangal Urban District Latest News
రామమందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రారంభమయింది. భాజపా అధ్యక్షురాలు రావు పద్మ లక్ష రూపాయల విరాళం అందజేశారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
!['రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి' Rao Padma donates Rs 1 lakh to Ram Mandir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10309430-114-10309430-1611129912620.jpg)
రామమందిరానికి రావు పద్మ లక్ష రూపాయల విరాళం
రామమందిర నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉండేలా నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు భక్తుల ప్రతీ గడపకు వస్తానని అన్నారు. వారు ఇచ్చే విరాళాలు సేకరిస్తారని తెలిపారు.
ఇదీ చూడండి: రామమందిర నిర్మాణానికి ఎంపీ సోయం బాపురావు లక్ష విరాళం