యాసంగి వరిధాన్యం కొనుగోళ్లకు 105 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ - కొనుగోళ్లకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు
యాసంగిలో వచ్చే వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ warangal urban dist collector rajeev gandhi hanumanthu review paddy buying arrangements in markets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10762506-176-10762506-1614176309463.jpg)
వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ద్వారా 35, పేస్ ద్వారా 69, ఏఎంసీ ద్వారా ఒక కేంద్రం ఏర్పాటుకు సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు సిద్ధం చేయాలని తెలిపారు. మార్కెట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ హనుమంతు స్పష్టం చేశారు.