చిన్నారులకు, గర్భవతులకు సమయానికి కచ్చితంగా టీకాలు వేసి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనమంతు ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖ అధికారులను అదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సభ్యులతో పోషణ్ అభియాన్‌లో చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోషణ్ అభియాన్ ద్వారా పోషణ లోపం, రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
'చిన్నారులు, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి' - poshan abhiyan latest news
పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిన్నారులకు, గర్భవతులకు సమయానికి కచ్చితంగా టీకాలు వేసి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లోని గర్బవతులకు ఐరన్, విటమిన్ సమృద్దిగా ఉన్న ఆహరంతో పాటు కాల్షియం మాత్రలు వేసుకునే విధంగా ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. సమయానికి సంబంధిత టీకాలు వేసి, నిరంతరం పరీక్షించి... ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుపుకునేలా చైతన్యపర్చాలని తెలిపారు. పోషణ లోపాలు తలెత్తకుండా క్షేత్రస్థాయి నుంచే తల్లిదండ్రులలో అవగాహన కల్పిస్తే సత్పలితాలు వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా పోషణ్ అభియాన్, వయోవృద్దులకు అత్యవసర సహాయం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14567, గోడ పత్రికలను కలెక్టర్ అవిష్కరించారు.
ఇవీ చూడండి: శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభం