జిల్లాలోని వివిధ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్ ఛాంబర్లో విద్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పెండింగ్ ఉపకార వేతనాలపై సమీక్షించారు. ఆయా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను తొందరగా పంపించేందుకు డిగ్రీ కళాశాలల్లో ఆర్జేడీలు, జూనియర్ కళాశాలల్లో డీఐవోలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
'ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి' - social welfare
వరంగల్ పట్టణ జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
'ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'
పెండింగ్ దరఖాస్తులను వెంటనే షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ అధికారులకు పంపించాలని పేర్కొన్నారు. జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల నుంచి మొత్తం 15,164 దరఖాస్తులు రాగా... అందులో 1912 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు మీ సేవకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు క్లియర్ చేసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు